భారతదేశం, ఏప్రిల్ 17 -- Chethabadi Movie Audio Rights Sold To Saregama: తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో జేడీ చక్రవర్తి ఒకరు. 90స్ కాలంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన జేడీ చక్రవర్తి నటుడిగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చేతబడి. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి తాజాగా ''చేతబడి" అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదివరకు ఈ రెండు నిర్మాణ సంస్థల నుంచి ప్రొడక్షన్ నెం 4గా ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు పోస్టర్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ సినిమా టైటిల్ చేతబడి అంటూ రివీల్ చేశారు దర్శకనిర్మాతలు.

చేతబడి సినిమాను మహర్షి కూండ్ల సమర్ప...