భారతదేశం, జూన్ 16 -- Chay on Sing Geetham: టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఇప్పుడు ఒకే ఒక్క సినిమాను ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి మెచ్చుకోగా.. తాజాగా మరో యువ హీరో నాగచైతన్య కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ వినూత్న ప్రయోగానికి చైతూ సెల్యూట్ చేశారు.

ఈ సింగ్ గీతం సినిమా అందించిన అనుభూతిని నాగ చైతన్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. "సింగ్ గీతం.. కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన సినిమా. ఈ రోజుల్లో ఇంత ప్యూర్ గా ఉండే సినిమాలు రావడం చాలా అరుదు. నేటి తరం రన్నింగ్ రేస్ వేగానికి లొంగకుండా, ఎలాంటి కల్మషం లేని ఒక అద్భుతమైన విజన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు లెజెండరీ వర్క్ అనేది.. ఈరోజు మనం చేస్తున్న సిన...