భారతదేశం, మార్చి 5 -- కొన్ని సినిమాలు వివిధ కారాణాలతో థియేటర్లలో రిలీజ్ కాకుండా ఆగిపోతాయి. ఓటీటీల పుణ్యమా అని అలాంటి మూవీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన సినిమానే 'చరిత కామాక్షి'. ఇవాళ (మార్చి 5) ఈ చిత్రం నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

అభయ్ నవీన్, దివ్య శ్రీపాద జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ లవ్ సినిమా 'చరిత కామాక్షి'. ఈ మూవీ ప్రధానంగా భార్యాభర్తల ప్రేమ చుట్టూ సాగుతోంది. ఈ చరిత కామాక్షి మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో చరిత కామాక్షి స్ట్రీమింగ్ అవుతోంది.

నిజానికి చరిత కామాక్షి సినిమా 2022లో థియేటర్లో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది. అప్పుడు ఏమైంది అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడ...