భారతదేశం, జూన్ 14 -- బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వారి సంస్థాగత శాఖల్లో ఖాళీగా ఉన్న 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారీ సంఖ్యలో అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో శిక్షణ పొందే అవకాశం లభించనుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbank.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 12 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 22, 2026 వరకు గడువు ఇచ్చారు. దర...