భారతదేశం, జూన్ 5 -- CBSE Re- evaluation 2026 updates : సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఇవాల్యుయేషన్ (మార్కుల పునర్మూల్యాంకనం) ప్రక్రియ కొనసాగుతుండటంతో, అప్డేటెడ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే, ఈ విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి!

జోసా పోర్టల్ ద్వారా వివిధ అకాడమిక్ కోర్సుల కోసం అభ్యర్థుల రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల (ఛాయిస్ ఫిల్లింగ్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశ...