భారతదేశం, మార్చి 14 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 17న మ్యాథమెటిక్స్ పేపర్‌తో ప్రారంభమైన ఈ పరీక్షలు, మార్చ్​ 10న ఫ్రెంచ్ పేపర్‌తో పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తి కావడంతో ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి ఫలితాలపై పడింది. మరి సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎప్పుడు?

2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాల తేదీని బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గత మూడేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం మెండుగా ఉంది.

గత మూడేళ్లలో ఫలితాల విడుదల తేదీలు:

2025 - మే 13

2024 - మే 13

2023 - మే 12

దీని బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా మే మధ్యలో అంటే మే 12 నుంచి 15 నాటికి సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విద్యా రంగ...