భారతదేశం, ఏప్రిల్ 15 -- CBSE Class 10 Results 2026: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్థుల సౌలభ్యం కోసం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఫలితాల సమయంలో వెబ్‌సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ అవ్వడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఫలితాలను వేగంగా అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల్లో స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సాధారణంగా ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఒకేసారి వెబ్‌సైట్లను సందర్శించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. దీనిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'ఉమంగ్' (UMANG) యాప్ మరియు 'డిజీలాకర్' (DigiLocker) సేవలను సీబీ...