భారతదేశం, ఏప్రిల్ 7 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలను గతంలో కంటే ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతియేటా మే నెలలో ఈ ఫలితాలు వెలువడతాయి. కానీ, పలు మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఏప్రిల్ 20 లోగా విడుదల అవుతాయి! పరీక్షా విధానంలో రాబోయే మార్పుల (ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కు షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

results.nic.in

cbseresults.nic.in

cbse.nic.in

వీటితో పాటు, పాఠశాలల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు కూడా ఫలితాలు నేరుగా అందుతాయి.

ఫలితాలను...