భారతదేశం, నవంబర్ 11 -- CBFC Titles Change Advisory Controversy: కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు దేశీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచార చిత్రాలు విడుదల చేసినా, మార్కెటింగ్ పూర్తి చేసినా చివరి నిమిషం వరకు సినిమా టైటిల్, విడుదల తేదీ ఖరారైనట్లు భావించకూడదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

ఈ కొత్త ఆదేశాలపై దక్షిణాది చిత్రసీమ, ముఖ్యంగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డు తన అధికార పరిధిని మించి ప్రవర్తిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

సినిమా పేరును ఖరారు చేయడం వెనుక పెద్ద కసరత్తే ఉంటుందని కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అనిల్ థామస్ తెలిపారు. ప్రతి సినిమా శీర్షికను రిజిస్టర్ చేసే ముందు దేశంలోని అన్ని ఫిల్మ్ ఛాంబర్లతో చర్...