భారతదేశం, ఆగస్టు 2 -- Actress Akanksha Choudhary On Casting Couch: పాపులర్ రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ సీజన్ 2' ముగింపు దశకు చేరుకుంది. చివరి వారంలోకి అడుగుపెట్టిన ఈ ఓటీటీ షోలో అనూహ్య మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ మోడల్, నటి ఆకాంక్ష చౌదరి షో నుంచి బయటకు వచ్చే ముందు మోడలింగ్ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ దారుణాలను బయటపెట్టి కలకలం రేపింది.

అందాల పోటీల్లో (Pageants) పాల్గొనేందుకు రూ. 1-2 లక్షల ఆర్థిక సాయం కోసం ఇండస్ట్రీలో బాగా పేరున్న ఒక పెద్ద మనిషిని కలిసినట్లు ఆకాంక్ష చౌదరి తెలిపింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, తనకు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్హతలతో అతని వద్ద పనిచేసి ఆ అప్పు తీరుస్తానని చెప్పానంది.

గతంలో పోటీలకు జడ్జిగా వచ్చిన పరిచయంతోనే అతని వద్దకు వెళ...