భారతదేశం, నవంబర్ 2 -- మీరు పండుగ సీజన్​లో కొత్త కారు లేదా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టే వార్త ఒకటి వెలువడింది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి డిమాండ్ సాధిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ తమ మోస్ట్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు 'విండ్సర్ ఈవీ', ప్రీమియం ఎస్‌యూవీ 'మెజెస్టర్' మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్తగా పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ముడిసరుకుల ధరలు హెచ్చుతగ్గులకు లోనుకావడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తిరుగులేని విజయం సాధించిన విండ్సర్ ఈవీ రేంజ్ మొత్తంపైనా కంపెనీ రూ. 15,000 స్థిరమైన పెంపును సంస్థ...