భారతదేశం, మార్చి 3 -- మీ కుటుంబంలోని పెద్దల కోసం లేదా మీకు తెలిసిన సీనియర్ సిటిజన్ల కోసం కారు కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ముందుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది! "వారి అవసరం ఏంటి?" అని. మెజారిటీ భారతీయ నగరాల్లో దీనికి సమాధానం.. ఇరుకైన వీధుల్లో సులభంగా నడపగలిగే, పార్కింగ్ చేయడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ కార్లు. అంతేకాకుండా, వయసు పైబడిన వారికి ట్రాఫిక్ రద్దీలో పదే పదే క్లచ్ నొక్కడం చాలా కష్టమైన పని. అందుకే వారికి 'ఆటోమేటిక్ గేర్‌బాక్స్' అనేది ఒక విలాసం కాదు, కనీస అవసరం.

సీనియర్ సిటిజన్ల కోసం మేు సిఫార్సు చేస్తున్న ఐదు ఉత్తమ కార్ల వివరాలు కింద ఉన్నాయి. ఈ జాబితా నుంచి మేము 'ఏఎంటీ' టైప్​ కార్లను ఉద్దేశపూర్వకంగా తొలగించాను. ఎందుకంటే అవి యాంత్రికంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌లే, కేవలం క్లచ్ ఆపరేషన్ మాత్రమే ఆటోమేటిక్. ఇవి తక్కువ ధరకే లభించినప్పటికీ, గేర్లు ...