భారతదేశం, మార్చి 27 -- నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కార్మేని సెల్వం. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు ఈ సినిమాను నిర్మించారు. రామ్ చక్రి దర్శకత్వం వహించిన కార్మేని సెల్వం తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది.

విలక్షణ నటుడు సముద్ర ఖనితోపాటు ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే, కార్మేని సెల్వం సినిమాలో లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా గురువారం (మార్చి 26) కార్మేన...