Car insurance : మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిందా? నో క్లెయిమ్ బోనస్ ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!
భారతదేశం, ఆగస్టు 30 -- సొంత కారు ఉన్న ప్రతీ ఒక్కరూ వాహన భద్రతతో పాటు ఇన్సూరెన్స్ పాలసీ గడువు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైరీ తేదీ దాటకుండా ముందస్తుగానే రెన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదాల వేళ జరిగే ఆర్థిక నష్టాలతో పాటు ఏళ్ల తరబడి మీరు కష్టపడి సంపాదించుకున్న 'నో క్లెయిమ్ బోనస్' (ఎన్సీబీ) ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి 'నో క్లెయిమ్ బోనస్' ఒక బహుమతి లాంటిది. ఏడాది పొడవునా ఎటువంటి క్లెయిమ్ చేయకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేసినందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంపై డిస్కౌంట్ రూపంలో ఈ బోనస్ ఇస్తాయి. మొదటి క్లెయిమ్-ఫ్రీ సంవత్సరానికి ప్రీమియంలో 20 శాతం మినహాయింపు లభిస్తే, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే ఈ డిస్కౌంట్ ఏకంగా 50 శాతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.