భారతదేశం, నవంబర్ 20 -- జాతీయ రహదారులపై వాహనం నడిపేవారికి ఇకపై వాహన బీమా విషయంలో కఠిన పర్యవేక్షణ ఎదురుకానుంది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా హైవేలపై తిరిగే వాహనాలను టోల్ ప్లాజాల వద్దే గుర్తించే సరికొత్త సాంకేతిక వ్యవస్థను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) పరీక్షిస్తోంది! ఈ ప్రతిపాదిత విధానం కింద, యాక్టివ్ బీమా పాలసీ లేని వాహనం టోల్ గేట్ దాటిన వెంటనే వాహన యజమాని మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అందుతుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

దిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమై దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే, ట్రాఫిక్ అధికారులు ప్రతి వాహనాన్ని ఆపి భౌతికంగా తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండానే బీమా లేని వాహనాలను సులభంగా గుర్తి...