భారతదేశం, ఏప్రిల్ 6 -- అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఏప్రిల్ 2న ఆమోదించింది. దాదాపు ఐదు గంటల చర్చ అనంతరం ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించింది. ఏ చట్టమైనా అమలులోకి రావడానికి అనుసరించే ప్రక్రియ ప్రకారం, దీనిని భారత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.

లోక్‌సభ, రాజ్యసభలు ఇప్పటికే దీనిని ఆమోదించినందున, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కేవలం లాంఛనం మాత్రమే. అయితే రాష్ట్రపతి ఆమోదం తెలిపే ముందు ఈ బిల్లును పరిశీలించి, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ద్రౌపది ముర్ము ఈ తీర్మానంపై అధికారికంగా సంతకం చేసిన వెంటనే.. అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా ప్రకటిస్తారు.

ఒక బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం చివరి దశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్...