భారతదేశం, ఏప్రిల్ 7 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఏపీకి రాజధానికి హోదా దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభించింది.

గత వారం పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం ఇది జరిగింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, జూన్ 2, 2024న అమల్లోకి వచ్చినట్లుగా భావించాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ను సవరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 5 (2) లో, 'ఒక కొత్త రాజధాని...