భారతదేశం, అక్టోబర్ 22 -- చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు చదువుతున్న అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీఏ ఇంటర్మీడియట్ సెప్టెంబర్ 2026 ఫలితాలు వచ్చేశాయి. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) గురువారం (అక్టోబర్ 22న) అధికారిక పోర్టల్‌లో ఈ ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరిగిన సీఏ ఇంటర్మీడియట్ పరీక్షల స్కోర్‌కార్డులు, మెరిట్ జాబితా, ఉత్తీర్ణత శాతాన్ని ఐసీఏఐ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....