భారతదేశం, మే 13 -- Bunny Vas: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ల డిమాండ్లు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సినిమా ఓనర్లు న్యాయం చేయాలంటున్నారు. ఇన్ని రోజులూ రెంట్ విధానంలో సినిమాలు ఆడించామని, ఇకపై పర్సెంటేజీ కావాలంటున్నారు. దీనిపై పాపులర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు సంచలన పోస్టు పెట్టాడు.

అసలే ఆదాయం తగ్గిపోయిందని, వచ్చే పావలా వాటా కోసం కొట్టుకోవడం కరెక్ట్ కాదని బన్నీ వాసు తన పోస్టులో పేర్కొన్నాడు. బుధవారం (మే 13) ఎక్స్ లో బన్నీ వాసు పెట్టిన సుదీర్ఘ పోస్టు వైరల్ గా మారింది. ఇందులో మూల కారణం ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని వాసు రాసుకొచ్చాడు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు చెప్పాడు.

''పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని...