భారతదేశం, జూలై 9 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగస్వాములు కావాలనుకునే సాంకేతిక నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది! బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చూస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్​హెచ్​ఎస్​ఆర్​సీఎల్) వివిధ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 237 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి, రైల్వే రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడాన...