భారతదేశం, జూన్ 22 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ అవసరాల కోసం, తక్కువ దూర ప్రయాణాల కోసం బడ్జెట్ ధరలో లభించే ఈవీ టూ-వీలర్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ యాంపియర్ తన ఎంట్రీ-లెవల్ ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. మార్కెట్లోకి సరికొత్త 'యాంపియర్ రియో వైబ్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 69,499 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

పట్టణాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు (వృద్ధులు), మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ అంపేర్ ఈ బడ్జెట్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఇదొక లో-స్పీడ్ (తక్కువ వేగంతో వెళ్లే) ఎ...