భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ 2026లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్​ అండ్​ ఓ) ట్రేడర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి షాక్ ఇచ్చారు. మార్కెట్‌లో మితిమీరిన ఊహాజనిత ట్రేడింగ్‌ను అరికట్టేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఫలితంగా ఫ్యూచర్స్ అండ్​ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

తాజా పరిణామాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఫ్యూచర్స్: ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఎస్టీటీని 0.05 శాతానికి పెంచారు.

ఆప్షన్స్: ఆప్షన్స్ ట్రేడింగ్‌పై పన్నును ఏకంగా 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెంపునకు ముందు ఫ్యూచర్స్​పై ఎస్టీటీ 0.02శాతంగా ఉండేది. ఆప్షన్స్​పై ఎస్టీటీ 0.01శాతంగా ఉండ...