భారతదేశం, అక్టోబర్ 14 -- Buchibabu Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన 'రణబాలి' (Ranabaali) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) విజయ్ స్టార్ ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ క్రేజ్ ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి హైదరాబాద్ లో జరిగిన రణబాలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు సాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "గీత గోవిందం సినిమాకు పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నా ఉప్పెన సినిమాకు కూడా పనిచేశాడు. ఆయన నాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ చ...