భారతదేశం, జూన్ 2 -- Buchi Babu Jr NTR: 'ఉప్పెన' లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి నెట్టింట ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. ఈ కథను బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్‌కు చెప్పారని, కొన్ని కారణాల వల్ల అది రామ్ చరణ్ వద్దకు చేరిందనే ప్రచారంపై తాజాగా డైరెక్టర్ స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్‌కు ఎప్పుడూ 'పెద్ది' కథను వినిపించలే...