భారతదేశం, ఏప్రిల్ 8 -- జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లను భారతీయులకు తిరిగి పరిచయం చేసిన మహీంద్రా బ్యాక్డ్ సంస్థ 'క్లాసిక్ లెజెండ్స్'.. ఇప్పుడు బీఎస్​ఏ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. స్క్రాంబ్లర్ శైలిలో కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు బీఎస్​ఏ స్క్రాంబ్లర్ 650 బైక్​ ఇండియా లాంచ్​ డేట్ ఫిక్స్​ అయ్యిందని తెలుస్తోంది. ఇది​ ఏప్రిల్ 23, 2026న భారత మార్కెట్​లో అడుగుపెట్టనుందని సమాచారం.

అంచనాల ప్రకారం.. ఈ కొత్త స్క్రాంబ్లర్ 650 మోటార్‌సైకిల్ ఇప్పటికే మార్కెట్​లో ఉన్న గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. లాంచ్ అయిన తర్వాత, ఇది మిడిల్ వెయిట్ స్క్రాంబ్లర్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650తో నేరుగా తలపడనుంది. గతేడాది జులైలో యూకేలో జరిగ...