భారతదేశం, జూన్ 21 -- BRAOU Admission Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలపై ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవచ్చు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉ...