భారతదేశం, సెప్టెంబర్ 10 -- BRAOU UG PG Admissions 2026 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30 (సెప్టెంబర్ 30, 2026) వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

బీఎస్సీ కోర్సులో చ...