భారతదేశం, సెప్టెంబర్ 30 -- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎస...