భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఉద్యోగులు, గృహిణులు, అలాగే దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ ఆన్‌లైన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ ద్వారా అందించే కోర్సుల్లో చేరేందుకు ప్రవాస భారతీయులకు (NRI) కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది.

ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. ప్రపంచంలో ఏ మూల ఉన్న విద్యార్థులైనా, ఉద్యోగులైనా సరే ఇంటర్నెట్ ద్వారా నేరుగా అడ్మిషన్ పొందే సదుపాయం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు డిజిటల్ మాధ్యమం ద్వారానే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అడ...