భారతదేశం, అక్టోబర్ 11 -- Brahmamudi Serial Timing: బుల్లితెర ప్రేక్షకులను తనదైన కథనంతో కట్టిపడేస్తున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi) మరో సంచలన అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ మా ఛానల్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సీరియల్, ఇప్పుడు అభిమానుల కోసం మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

ఇప్పటివరకు సాధారణ సమయంతో 30 నిమిషాల పాటు అలరించిన ఈ బ్రహ్మముడి సీరియల్ ఇకపై 45 నిమిషాల పాటు ప్రసారం కానుంది. ఈ సీరియల్ సరికొత్త మలుపులతో, ఊహించని ట్విస్టులతో మిమ్మల్ని అలరించడానికి ఎక్స్ ట్రా టైమ్ రాబోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఎక్స్‌ట్రా టైమ్ ద్వారా బ్రహ్మముడి సీరియల్ కథలో మరిన్ని కీలక పరిణామాలు, ఆసక్తికరమైన డ్రామాను జోడించి ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా ఎంటర్...