భారతదేశం, సెప్టెంబర్ 23 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ రాజు, రేఖ ఎత్తుకుపైఎత్తులతో సాగిపోయింది. సిరి పేరు చెప్పి రాజుని ఇరికించి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖ ప్లాన్ ఫెయిలవుతుంది. అటు రేఖ కంటే ముందే సిరి ఎవరు? ఆమె గతమేంటో తెలుసుకునే పనిలో పడతారు రాజు, ఇందు.

ఐశ్వర్య హాల్ టికెట్ తో సిరి పడవ చేసి ఆడుకునే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఐశ్వర్య పెద్ద గొడవ చేస్తుంది. సిరిని కొట్టబోతుంది. ఇందు, రాజు ఆమెను అడ్డుకుంటారు. తప్పు నీదే.. హాల్ టికెట్ ను ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఎలా.. సిరి చిన్నపిల్లలా ఉంటుందని తెలుసు కదా అని ఇందు క్లాస్ పీకుతుంది.

అయినా హాల్ టికెట్ బాగానే ఉంది కదా ముందు వెళ్లి ఎగ్జామ్ రాయమని అనడంతో తిరిగి వచ్చి మీ సంగతి చెబుతానంటూ ఐశ్వర్య వెళ్లిప...