భారతదేశం, సెప్టెంబర్ 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో మదన్, స్వాతి పెళ్లి చేసుకుంటామంటారు. కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్‌గా పెళ్లి చేస్తామని రేఖ అంటుంది. ఇప్పుడు కూడా మా పెళ్లిని డబ్బుతో కొలుస్తున్నావ్. మా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోలేదని స్వాతి మెడలో మదన్ తాళి కడతాడు.

రేఖ, భ్రమరాంబ, భూషణ్ షాక్ అవుతారు. కోపంతో రగిలిపోతుంటారు. ఎస్సై దండలు ఇస్తే మదన్, స్వాతి మార్చుకుంటారు. మదన్, స్వాతి సంతకం పెడతారు. ఈ పెళ్లికి సాక్షులుగా రాజు, ఇందు సంతకం పెడతారు. మీవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండని ఎస్సై అంటాడు. వాళ్లకు ఆశీర్వదించే మంచి మనసు లేదని మదన్ అంటాడు.

దాంతో రేఖ, భూషణ్, భ్రమరాంబ కోపంతో వెళ్లిపోతారు. శేషు మాత్రం అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లిపోతాడు. రాజు, ఇందుల ఆశీర్వాదం తీసుకుంటారు మదన...