భారతదేశం, ఏప్రిల్ 29 -- Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 29వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందుని కిడ్నాప్ చేసి, మెల్లగా ఆమె ప్రేమలో పడిపోతున్న రాజుకు ఊహించని షాక్ తగులుతుంది. ఇందుని రేఖ దూరంగా తీసుకెళ్లిపోతుంటే అతడు ఏమీ చేయలేక అలా చూస్తుండిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో ఇందుని రేఖ లాక్కెళ్తుండటం చూడొచ్చు. ఆమె కళ్లలో పడకుండా దూరంగా రాజు.. ఇందుని బాధతో చూస్తుంటాడు. అటు ఇందు కూడా రాజుని వదిలి వెళ్తూ కంటతడి పెడుతుంది. సాహు ఇచ్చిన డెడ్ లైన్ లోపు డబ్బు వసూలు చేయాల్సిందే అని అనుకున్న రాజు.. రేఖపై ఒత్తిడి తెచ్చి డబ్బు ఇచ్చేలా చేస్తాడు.

అదే సమయంలో ఇందు దూరం కాబోతుందన్న బాధ అతన్ని తీవ్రంగా కలచివేస్తుంది. కొన్ని రోజుల్లోనే వాళ్ల మధ్య ఉన్న శతృత్వం ప్రేమగా మారుతుంది. కిడ్నాప్ చ...