భారతదేశం, అక్టోబర్ 30 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటి తాళాలు పట్టుకుని అధికారంతో చక్రం తిప్పుతుంటుంది రేఖ. శేషు అన్నమాటలను గుర్తు చేసి ఇప్పుడు చూశావా అని చిటికేస్తూ తన పవర్ చూపిస్తుంది రేఖ. ఇల్లంతా నీ కంట్రోల్‌లో ఉందని భ్రమరాంబ అంటుంది.

రాజు గాడి బెస్ట్ ఫ్రెండే వాడిపాలిట రాహువులా మారాడని భూషణ్ అంటాడు. శేషు సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని, ఏదోటి చెప్పమని రేఖ అంటుంది. చెప్పాలని ఉన్నా మీకు వినాలని ఉందో లేదో అని శేషు అంటాడు. అయినా చెప్పమని రేఖ అంటుంది. రాజు వెళ్తున్నా ఇందు సైలెంట్‌గా ఉంది. అంటే మనం అనుకుంది కాకుండా ఏదో జరుగుతుందనిపిస్తుందని శేషు అంటాడు.

ఇందు మౌనం వెనుక ఆస్తికి నష్టం జరుగుతుందని అంతే అని రేఖ అంటుంది. ఇందు ఆస్తుల కోసం భయపడే రకం కాదు ఇంకా ఏదో తేడా కొడుతుందని శేషు అంటుంది. రేఖ, శేషు వాది...