భారతదేశం, అక్టోబర్ 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్యకు ఆవేశం ఎక్కువని, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ తప్పా బిజినెస్ నిలబెట్టే లక్షణం ఒక్కటిలేదని ఇందు, రాజు అంటారు. రేఖ, బ్రమరాంబ సపోర్ట్ చేస్తే అపర్ణ నోరుమూయిస్తుంది. మాటమీద నిలబడతావ్ కదా ఇందు ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని ఐశ్వర్య అంటుంది.

నువ్వు చెప్పావనేగా కడుపులో బిడ్డను ఉంచుకున్నాగా అని ఐశ్వర్య అంటుంది. వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారు నీ నిర్ణయం నువ్వు తీసుకో అని రేఖ అంటుంది. నాకు నచ్చినట్లుగా పవర్స్ ఇస్తారా లేదా నాకు నచ్చిన నిర్ణయం తీసుకోనా అని బిడ్డను తీయించుకోవడం గురించి ఐశ్వర్య బెదిరిస్తుంది. ఇస్తాను. నువ్వు అడిగినట్టే అన్ని అధికారాలు ఇస్తాను అని ఇందు అంటుంది.

అందరం ఒక్కసారిగా మీద పడేసరికి ఎలా వెనక్కితగ్గిందో చూశారా అని భ్రమరాంబ అంటుంది...