భారతదేశం, అక్టోబర్ 14 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ కీలక మలుపులతో సాగిపోయింది. మొత్తానికి ఐషూ మెడలో లక్కీ తాళి కట్టి ఫస్ట్ నైట్ కోసం ఆరాటపడతాడు. అయితే అదే రాజు, ఇందులను ఇరికిస్తుంది. వాళ్ల పిల్లల గురించి ఇంట్లో వాళ్లు నిలదీస్తారు. కానీ వాళ్లు తెలివిగా తప్పించుకుంటారు.

ఐశ్వర్య పెళ్లిని ఆపే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. ఎందుకు ఆపావని రాజు నిలదీస్తాడు. పెళ్లి పీటలపైనే ఇందు తనకు కంపెనీ పెట్టిస్తానన్న అగ్రిమెంట్ ఇస్తానని చెప్పిందని, అది ఇచ్చే వరకు తాళి కట్టించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. దీంతో అపర్ణ ఆమెను తిడుతుంది. అయినా ఐషూ వినదు. ముందు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాతే పెళ్లి అంటుంది.

దీంతో చేసేది లేదక ఇందు వెళ్లి అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పటికైనా తాళి...