భారతదేశం, నవంబర్ 5 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజుతో తల్లి లక్ష్మి మాట్లాడుతుంది. ఆయన అన్నారని నీతో చేయి పట్టుకుని నడవాలనుకున్న ఇందును వదిలేస్తావా అని నిలదీస్తుంది. నాన్నను ఏమనకమ్మా. నాకు జన్మనిచ్చారు. నాన్న బాధపడేది నేను ఏం చేయలేనని రాజు అంటాడు. ఆ మాటలు చలపతి వింటుంటాడు.

నేను ప్రేమించిన రాజు నన్ను మోసం చేశాడని ఇందు జీవితాంతం కుమిలికుమిలి ఏడవాలా చెప్పు అని లక్ష్మి అడుగుతుంది. రాజు ఏడుస్తుంటాడు. రాజు కన్నీళ్లు చూసి ఏంట్రా ఇదంటే.. ఈ కన్నీళ్లే నీ సమాధానమే అని అంటాడు. తన మెడలో ఇంకాసేపట్లో వేరేవాడెవడో తాళి కడతాడు. అప్పుడు తను ఇంకొకరి భార్య. అవన్ని గుర్తొస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని కుమిలికుమిలి ఏడుస్తుంటాడు రాజు.

తల్లి ఓదారుస్తుంది. తనను మర్చిపోయేది ఉంటే కన్నీళ్లతో మర్చిపోయేవాన్ని. కానీ, తను ...