భారతదేశం, మే 9 -- Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందును నకిలీ పెళ్లి చేసుకొని దుగ్గిరాల ఇంట్లో అడుగుపెడతాడు రాజు. రేఖ ఆమె మెడలో తాళి తీసేయడానికి వెళ్తే రాజు అడ్డుకుంటాడు. ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. చేసేది లేక ఇంట్లోకి రమ్మన్న రేఖ.. తర్వాత విడాకుల ప్లాన్ చేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 9) ఎపిసోడ్ దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన రాజు.. ఇందును కిడ్నాప్ చేసిన కథ చెబుతాడు. ఆ కిడ్నాపర్ ను తనే అని, ఆ సమయంలోనే చక్రాల్లాంటి ఇందు కళ్లు చూసి ఆమె ప్రేమలో పడిపోయానని అంటాడు. అయితే డబ్బు కోసం ఆ ప్రేమను వదులుకున్నానని, కానీ అప్పటి నుంచీ ఆమె ఆలోచనలతోనే గడిపానని చెబుతాడు. మీరు చేసుకున్నది ఉత్తిత్తి పెళ్లి కావచ్చు కదా అని రేఖ అంటుంది.

అప్పుడు తమ పెళ్లి రిజిస్టర్ చేయించానని, ఫొటోలు కూడా తీయించానని సాక్ష్యాలతో సహా చూయి...