Brahmamudi May 13th Episode: రేఖకు మరో షాక్.. రాజు సంతకం కూడా కావాలన్న లాయర్.. నిజం దాచిన చలపతి.. చెల్లినని చెప్పిన నందు
భారతదేశం, మే 13 -- Brahmamudi May 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులే ఉన్నాయి. రాజు గురించి తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. మరోవైపు ఆస్తి సొంతం కావాలంటే రాజు సంతకం కూడా కావాలని లాయర్ స్పష్టం చేస్తాడు. ఇటు ఇందుని పెళ్లి విషయంలో నిలదీసిన నందు.. తాను సొంత చెల్లిని అని చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 13) ఎపిసోడ్ రాజు గురించి చలపతి ఆందోళన పడే సీన్ తో మొదలవుతుంది. వాడు ముందు ఉంటే తిడతాను కానీ.. ఇప్పుడు కనిపించకపోతే భయం వేస్తోందని, వాడు బాగుండాలని చలపతి అంటాడు. రాజు జాడ తెలియకపోవడంతో కంటతడి పెట్టుకుంటాడు. లక్ష్మి అతనికి ధైర్యం చెబుతుంది.
ఇటు ఇంట్లో సుభాష్, అపర్ణ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి రాజు నటిస్తాడు. బయట కుర్చీలో కూర్చొన్న సుభాష్ దూరంగా ఉన్న వాటర్ బాటిల్ అందుకోవడానికి ప్రయత్నించి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.