భారతదేశం, మార్చి 7 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు ఎలాగాలో ఎగ్జామ్ రాస్తుంది. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా అన్నింటినీ దాటుతుంది. చివరికి ఇంట్లో రేఖకు దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మార్చి 7 ఎపిసోడ్ ఇందు కోసం తల్లితో స్వాతి నాటకమాడే సీన్ తో మొదలవుతుంది. ఎగ్జామ్ టెన్షన్ లో ఉన్న ఇందును బయటకు పంపించడానికి తన డ్రెస్సు కుట్టించుకొని రావాలని స్వాతి ఆర్డర్ వేస్తుంది. తన తల్లిలాగే మాట్లాడుతూ ఇందును డామినేట్ చేయాలని చూస్తుంది. అది చూసి భ్రమరాంబ షాక్ తింటుంది.

ఓ దశలో ఒసెయ్ ఇందు అంటూ పూర్తిగా తల్లిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. డ్రెస్సును టేలర్ దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఎగ్జామ్ రాసి వచ్చేయొచ్చన్నది ఇద్దరి ప్లాన్. రేఖ ఆంటీ బయటకు వెళ్లొద్దని చెప్పింది కదా అని ఇందు అంటున్నా.. స్వాతి రెచ్చగొట్టడంతో భ్...