భారతదేశం, మార్చి 31 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో రోజాను కలిసేందుకు వెంకీ నందుతోపాటు వెళ్తాడు. వెళ్లి పలకరిస్తాడు. తీసుకొచ్చిన రోజ్ ఫ్లవర్‌ను రోజాకు ఇస్తాడు వెంకీ. నందు కవిత చెబితే అదే వెంకీ చెబుతాడు. వెంకీ చెప్పింది విన్న రోజా చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆఫీస్‌లో ఎందుకు ఇలా ఉండవని అడుగుతుంది. ఇంతలో నందుకు ఓ రౌడీ కనిపించడంతో వాడి గురించి మాట్లాడుతుంది.

అవే మాటలు రోజాతో వెంకీ మాట్లాడుతాడు. దాంతో రోజా కోప్పడుతుంది. ఆ రౌడీ దగ్గరికి వెళ్లి ఏరా పౌడర్ బాగా అమ్ముతున్నావా, మత్తు పదార్థాలు అమ్మేవాడికి నా గురించి చెప్పాల అని నందు అంటుంది. దాంతో రౌడీ పారిపోతాడు. పట్టుకోడానికి నందు వెళ్తుంది. తన గురించి ఇంకా మాట్లాడమని వెంకీని రోజా అడుగుతుంది. ఇక వెంకీ ఏం మాట్లాడలేకపోతాడు. దాంతో కోపంగా రోజా వెళ్లిపోతుంది...