భారతదేశం, మార్చి 28 -- Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్యను రేఖ లాగిపెట్టి కొడుతుంది. అందరి ముందూ తన పరువు తీశావని క్లాస్ పీకుతుంది. అటు రాజును చూసి షాక్ తిన్న రేఖ.. అతడు ఎవరో తేల్చే పనిలో భాగంగా ఏకంగా అతని ఇంటికే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 28) ఎపిసోడ్ నెక్లెస్ దొంగతనం చేసింది ఇందు కాదు ఐశ్వర్య అనే రేఖ తెలుసుకునే సీన్ తో మొదలవుతుంది. ఈ విషయం చెప్పిన స్వాతి.. మరో నెక్లెస్ తన తల్లి భ్రమరాంబ దొంగతనం చేసిందన్న విషయం మాత్రం దాచి పెడుతుంది. నీ గది ముందే అది దొరికిందని రేఖతో అంటుంది. దీంతో భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది.

అప్పుడే అపర్ణ గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రాజును ఎక్కడ చూస్తుందో అని రేఖ కంగారు పడిపోతోంది. వెంటనే భూషణ్ ను పంపించి ఆమెన...