భారతదేశం, మార్చి 20 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో గుడిలో లాయర్‌ను కలిసిన అపర్ణ మా ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ రేఖ తన నుంచి బలవంతంగా రాయించుకుందని చెబుతుంది. అది ఇల్లీగల్ అని లాయర్ చెబుతాడు. ప్రతి సంవత్సరం వచ్చే డబ్బు తనే తీసుకుంటుంది అని అపర్ణ అంటుంది.

అది ఇంకా పెద్ద క్రైమ్. మీరు కేసు వేస్తే ఇప్పటివరకు వాళ్లు ఖర్చు చేసింది అంతా మీకు కోర్టు ఇప్పిస్తుందని లాయర్ అంటాడు. ఆ డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు. కానీ ఇందు మేజర్ కాబట్టి ఆస్తి మొత్తం తన పేరు మీదకు వచ్చేదాకా పవర్ ఆఫ్ అటార్నీ కూడా తనకు వచ్చేలా చేయండి, నా మనవరాలికి న్యాయం కావాలి అని అపర్ణ అంటుంది.

ఇవాళే రేఖపై కేసు వేస్తాను. మీకు వచ్చేలా చేస్తాను అని లాయర్ అంటాడు. కానీ, కోర్టులో కేసు గెలిచే వరకు ఈ విషయం రేఖకు తెలియకూడదు అని అపర్ణ అంటుంది. వాళ్లకు...