భారతదేశం, మార్చి 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందును తన కూతురే బయటకు పంపించిందని, అందులో అనుమానించేందుకు ఏం లేదని భ్రమరాంబ అంటుంది. అనుమానించాలి, దీనిలో ఉంది మాములు రక్తం కాదు అని రేఖ అంటుంది. నేను నిజంగానే బట్టలు కుట్టించడానికి వెళ్లాను అని ఇందు చెబుతుంది.

మరి ఆ టైలర్ షాప్ పేరు, అతని పేరు ఏంటని రేఖ అడుగుతుంది. సత్యం బాబు టైలర్ షాప్, సత్యం బాబు అని ఇందు చెబితే.. ఆ టైలర్ వాడి నెంబర్ చెప్పమని రేఖ అడుగుతుంది. అతని ఫోన్ నెంబర్ లేదని ఇందు చెబితే.. స్వాతి ఆ నెంబర్ ఇవ్వు, సంక్రాంతికి వాడికి గంట గంటకు ఫోన్ చేసి బట్టలు రెడీ అయ్యాయా అని అడిగావ్‌గా అని రేఖ అంటుంది.

దీనికి అన్ని గుర్తుండి చస్తాయని స్వాతి విసుక్కుంటుంది. చేసేది లేక టైలర్ అతని నెంబర్ ఇస్తుంది. రేఖ కాల్ చేసి అడిగితే.. ఇందు మేడమ్ వచ్చారన...