భారతదేశం, జూలై 7 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో కథ మొత్తం మలుపు తిప్పే మరో ట్విస్ట్ ఎదురైంది. రాజు వెళ్లిపోవడంతో ఒంటరైన ఇందుని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చేసిన రేఖకు అదే రాజు ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చిన నందు షాకిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ రాజు దగ్గరికి వచ్చిన నందు అతన్ని తిట్టే సీన్ తో మొదలవుతుంది. మా అక్క నిన్ను నమ్ముకుంటే నిండా ముంచేసి వచ్చేశావ్.. నువ్వు డబ్బు మనిషివి.. నువ్వేదో అందగాడివని మా అక్క నిన్ను పెళ్లి చేసుకోలేదు.. అండగా ఉంటానని చేసుకుంటే నువ్విలా మధ్యలోనే వచ్చేసి మోసం చేస్తావనుకోలేదు అని రాజుని నందు నానా మాటలు అంటుంది.

దీంతో రాజు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాను మీ అక్కను వదిలేసి రాలేదని, ఆమె వెళ్లిపోమంటేనే వచ్చానని, రోజు కూలీనైన తాను అంతకంటే...