భారతదేశం, జూలై 30 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు రిలాక్స్ అవుతుంటే ఇందు కాఫీతో వస్తుంది. గోడపై ఉన్న బల్లిని తనను బావను ఒక్కటి చేసేందుకు ఏదైనా చేయొచ్చుగా అని ఇందు అంటుంది. బల్లి సౌండ్ చేస్తుంది. ఏంటా సౌండ్. నీ సౌండ్ నాకు అర్థం కావట్లేదు అని ఇందు అంటుంది.

ఇంతలో రాజు ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. ఇందు వచ్చి నీతోనే బావ అంటూ గారాలు పోతుంది ఇందు. బావ అని పిలవడం డైజెస్ట్ కావట్లేదని రాజు కంగారుపడతాడు. నువ్వు నిజంగా నా మరదలు అయితే అలా పిలిస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. కానీ మనది తాత్కాలిక బంధం. అందుకే అసహ్యంగా ఉంది. పైగా వెటకారంగా ఉన్నట్లుందని రాజు అంటాడు.

ఇంతలో రాజుపై బల్లి పడుతుంది. దాంతో భయపడి ఇందుపైకి ఎక్కుతాడు రాజు. రాజును తన్మయంతో చూస్తుంది ఇందు. తర్వాత రాజు తేర...