భారతదేశం, జూలై 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందు ప్రేమ గురించి ఆలోచిస్తూ విరహవేదన అనుభవిస్తుంటాడు వెంకీ. ఇంతలో నందు కాల్ చేస్తుంది. కానీ, వెంకీ కాల్ కట్ చేస్తాడు. మళ్లీ నందు కాల్ చేయడంతో వెంకీ లిఫ్ట్ చేస్తాడు. మనం బయటకు అర్జంట్‌గా వెళ్లాలని నందు అంటే.. రాలేను అని వెంకీ అంటాడు.

నేను దుగ్గిరాల ఇంటి అమ్మాయిని అని తెలిసినప్పటి నుంచి అదోలా చేస్తున్నావ్ అని డౌట్ పడుతుంది నందు. అలా కాదు. ఏం అనుకోకు. వేరే వర్క్ ఉందని వెంకీ కాల్ కట్ చేస్తాడు. వీడేంటీ నేను లవ్ యాక్సెప్ట్ చేస్తానో లేదో అని టెన్షన్ పడుతున్నాడా. మనమే ఓ అడుగు ముందుకు వేయాలని నందు అనుకుంటుంది. అంటే వెంకీకి నందునే లవ్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతుంది. మరోవైపు పొదరిల్లు సీరియల్ ప్రోమోను లక్కీ హాల్లో టీవీలో చూస్తుంటాడు.

అప్పుడే మదన్ వస్తాడు. ...