భారతదేశం, ఆగస్టు 20 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీని నీ కొడుకు అని ఒప్పుకునేందుకు రేపటితో పూర్తవుతుంది. నువ్వు చెప్పకుంటే నేనే చెప్పేస్తాను అని రేఖతో రాజు అంటాడు. సరే చెప్పుకో అని రేఖ అంటుంది. దాంతో రాజు షాక్ అవుతాడు.

నన్ను రెచ్చగొడుతున్నావ్ నిజంగానే చెబుతానని రాజు అంటాడు. నువ్వు చెప్పిన ఎవరు నమ్మరుగా అని రేఖ అంటే.. నా దగ్గర సాక్ష్యం ఉందిగా అని రాజు అంటాడు. ఆ సాక్ష్యం నేను మాయం చేశానుగా. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉంటే నేను ఏం చేయననుకున్నావా. నేను నిజాన్ని పాతిపెట్టే ప్లాన్‌లో ఉన్నాను. పాతిపెట్టాను కూడా. ఆంటోనీని తీసుకొచ్చి నిజం చెప్పించలేవని. ఏం చేస్తావ్ అని రేఖ అంటుంది.

తప్పు చేస్తున్నావ్. ఇప్పటికే లక్కీ నరకం చూస్తున్నాడు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకో అని రాజు అంటే.. పుట్టినప్పుడే వాడిని వద్దనుక...