భారతదేశం, ఆగస్టు 12 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో తమ అక్క ఐశ్వర్యను శశి బారి నుంచి ఇందు, నందు కాపాడతారు. అయినా ఐషూ బుద్ది మాత్రం మారదు. శశిని గుడ్డిగా నమ్మిన ఆమె.. వాళ్లనే తప్పుబడుతూ అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. అటు ఇందుకి శశి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఐశ్వర్యతో కలిసి శశి బర్త్‌డే పార్టీ చేసుకునే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 12) ఎపిసోడ్ మొదలైంది. శశికి ఐషూ ఓ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. తానెప్పుడూ ఖరీదైన ఉంగరాలనే పెట్టుకున్నా.. ఇది మాత్రం చాలా స్పెషల్ అని శశి అంటాడు. కేక్ కట్ చేద్దామని అంటాడు. ఇంకా ఎవరూ రాలేదు కదా అని ఐశ్వర్య అంటుంది. ఎవరూ రారు.. అదే సర్‌ప్రైజ్ అని శశి అనడంతో.. ప్రపోజ్ చేయడానికి పెద్ద ప్లానే వేసినట్లున్నావ్ కదా అని ఐషూ మనసులో అనుకుంటుంది.

ఇటు ఐషూ...