భారతదేశం, ఏప్రిల్ 30 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చలపతి, లక్ష్మీ పెళ్లిరోజుకి రాజ్, లక్కీ చదివింపులు తీసుకుంటారు. ఒకరితో డబ్బులు తీసుకుంటుండగా.. ఇందు వచ్చి అడ్డుకుంటుంది. వద్దని చెప్పి అతన్ని పంపిస్తుంది. లక్కీని తెగ తిడుతుంది. మనం చేసింది పెళ్లి కాదు, పెళ్లి రోజు అని అంటుంది.

దాంతో రాజ్ ప్లేట్ తిప్పేసి తను కూడా చదివింపులు వద్దన్నానని, లక్కీ గాడు అస్సలు వినలేదని ఫ్రెండ్‌పై తప్పు నెట్టేస్తాడు. అబ్బా ప్లేట్ భలే తిప్పేశావురా అని లక్కీ అనుకుంటాడు. ఇదంతా నీ ఐడియా అని నాకు తెలుసు. ఓవరాక్షన్ చేయకు, ఇంకోసారి ఇలాంటివి చేయకు అని రాజ్‌‌ని కూడా తిడుతుంది ఇందు. తర్వాత ఇంట్లో అంతా కూర్చొంటారు. ఇందును ఫంక్షన్ బాగా చేసిందని చలపతి బాగా పొగుడుతాడు.

ఇంతలో ఒక్కటి తగ్గిందంటూ సాహు వస్తాడు. సాహు ఎంట్రీతో రాజ్ వణికిప...